Bigg Boss: ఒక్కటే ఫ్రేమ్‌లో నలుగురు సౌత్ సూపర్స్టార్లు... బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ లాంచ్!
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' సందడి కౌంట్ డౌన్ మొదలైంది. అది కూడా దక్షిణాది బుల్లితెరపై ఇప్పటివరకు చూడని ఒక అద్భుతమైన వినోద విప్లవం ఆరంభం కాబోతోంది. బిగ్ బాస్ లవర్స్ కోసం ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఏకంగా నాలుగు భాషల్లో ఒకేసారి రెడీ అయ్యాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 'బిగ్‌బాస్' కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నాలుగు భాషల బిగ్‌బాస్ హోస్ట్స్ గా చేస్తున్న సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.