Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' హౌస్‌లోకి ఆ 20 మంది.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనా?
అయితే ఇప్పటివరకు వినిపిస్తున్న లీక్స్ సెలబ్రిటీ లిస్ట్‌లో సీరియల్ హీరోయిన్ దేబ్జానీ, సీరియల్ హీరో ముఖేష్ గౌడ, జబర్దస్త్ కమెడియన్స్ రామ్ ప్రసాద్, నరేష్, యాంకర్ వర్షిణి, సీరియల్ నటి చైత్రా రాయ్, 'వినాయకుడు' మూవీ ఫేమ్ కృష్ణుడు, సుధీర్ రెడ్డి, అదిత్ ఈశ్వరన్, టెంపర్ వంశీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక 'అగ్నిపరీక్ష 2' నుంచి ఎవరెవరు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 'అగ్నిపరీక్ష 2' లో 13 మంది మిగిలి ఉన్నారు. వారిలో ప్రస్తుతం వినిపిస్తున్న లీక్స్ ప్రకారం మిథిలేష్, చరణ్, రాజకుమారి, రోహిత్, ఝాన్సీ, అమన్, శ్రష్టి, షాలినీ, నవరసాల ఆర్కే, అపూర్వ, దీపక్ వంటి పేర్లు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా మూడు గ్రీన్స్ సాధించిన మిథిలేష్, చరణ్, రాజకుమారి దాదాపు కన్ఫామ్ అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అగ్నిపరీక్షలో పాల్గొన్న వారితో కొందరు షో మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కూడా హౌస్ లోకి రానున్నారు.