Bigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే..
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు తెలుగులో తొమ్మిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు దశావతారం పేరుతో బిగ్ బాస్ తెలుగు 10 రాబోతుంది. ఇప్పుడు ఈ షో ప్రారంభానికి వేళయింది. మరికొన్ని రోజుల్లో ఈ గ్రాండ్ షో షురూ కానుండటంతో, ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ కంటెస్టెంట్ల పేర్లపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో క్రేజీ నటుడి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నో సినిమాల్లో విలన్గా, సహాయ నటుడిగా మెప్పించిన ప్రముఖ నటుడు ‘టెంపర్’ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లబోతున్నారని పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరుగుతోంది.