ఆది రెడ్డి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న జాబితాలో మరికొంత మంది పేర్లు కూడా ఉన్నాయి.
టెంపర్ వంశీ – ‘టెంపర్’ సినిమా ఫేమ్ క్యారెక్టర్/విలన్ ఆర్టిస్ట్. సృష్టి వ్యాకరణం – మోడల్, ఫిట్నెస్ ఫ్రీక్. ఆర్జే చరణ్ – ‘అగ్నిపరీక్ష’ ఆర్జే, ఎంటర్టైనర్. వర్షిణి సౌందరరాజన్ – ప్రముఖ యాంకర్, నటి. జాన్సీ – రైతు, సింగర్; ‘అగ్నిపరీక్ష’ ద్వారా నేరుగా ఎంపికైన కంటెస్టెంట్‌గా ప్రచారం. నరేష్ – ‘జబర్దస్త్’ నరేష్, పొట్టి నరేష్‌గా గుర్తింపు. దేబ్జానీ మోదక్ – సీరియల్ నటి, ‘కుక్ విత్ జాతిరత్నాలు’ ఫేమ్. చైత్ర రాయ్ – ప్రముఖ సీరియల్ నటి. నవరసాలు ఆర్కే – ‘అగ్నిపరీక్ష’ కామనర్ కంటెస్టెంట్. సుధీర్ రెడ్డి – పోడ్కాస్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆది రెడ్డి చెప్పిన లిస్ట్ ప్రకారం చూస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్ల ఎంపిక చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న సీరియల్ నటులు, సినీ నటులు ఉండగా.. మరోవైపు ‘అగ్నిపరీక్ష’ వంటి కార్యక్రమాల నుంచి వచ్చిన కామనర్లకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ పేర్లలో ఎంతమంది నిజంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనే దానిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.