ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు.. బిగ్‌బాస్ సీజన్ 10 డేట్ రిలీజ్
ఆడియన్స్‌కు ఎంతో చేరువైన బిగ్‌బాస్ రియాలిటీ షో 10వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో ‘బిగ్ బాస్ సీజన్ 10’ రానుంది (Bigg Boss). దీని విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 6 సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ లాంచ్ కానుంది (Bigg Boss 10). స్టార్ మా, హాట్ స్టార్‌లో ప్రసారం కానుండగా.. ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ‘మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్ ఉంటుంది (Bigg Boss 10 Date). ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అంటూ వీడియోను పంచుకున్నారు. సర్ప్రైజ్లు, డ్రామా, సవాళ్లు అన్నీ 10 రెట్లు ఉంటాయని తెలిపారు. ఈ సీజన్‌కు కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.