వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్
బిగ్‌బాస్ సీజన్ 10లో హౌస్‌మేట్‌గా మారేందుకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయంలో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ మొదలైంది. రెడ్, బ్లూ టీమ్ సభ్యుల ఫొటోలను పెట్టి.. హౌస్‌మేట్‌గా మారేందుకు అర్హత లేని ఐదుగురి ఫొటోలపై కారణాలు చెబుతూ స్టార్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాంప్రసాద్, వర్షిణి ఎం చెప్పారంటే.. బ్లూ టీమ్ నుంచి వర్షిణి, రాంప్రసాద్ కలిసి రోహిత్, చరణ్ ఫొటోలపై స్టార్ చేశారు. అగ్నిపరీక్షలో రోహిత్‌ను పదేపదే లేపి పైకి కూర్చోబెట్టారని.. అంతేతప్ప అతనికి అంత సీన్ లేదని వర్షిణి చెప్పింది. అగ్నిపరీక్షలో రోహిత్ 100 శాతం ఇచ్చాడని అనుకుంటే.. హౌస్‌లో మాత్రం 10 శాతం కూడా చరణ్ లేడని రాంప్రసాద్ వ్యాఖ్యానించాడు. మరోవైపు దేబ్జానీ.. షాలినీ ఫొటోపై స్టార్ చేసింది. షాలినీకే అంతా తెలుసన్నట్లు వ్యవహరించడం తనకు నచ్చలేదని చెప్పింది. అలాగే సృష్టి, అమన్ కూడా హౌస్‌మేట్‌గా ఉండేందుకు అర్హులు కాదంటూ బ్లూ టీమ్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.